ప్రపంచంలోనే అతి పొడవైన.. స్ట్రెయిట్ రోడ్‌గా గిన్నిస్ రికార్డ్​

సౌదీ అరేబియాలోని రబ్​ అల్​ కాళీ ఎడారి గుండా వెళ్తున్న (హైవే 10) 256 కిలోమీటర్ల స్ట్రెయిట్​ రోడ్డు ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్​ రోడ్డుగా గిన్నిస్ రికార్డుగా నమోదు చేసుకుంది. ఈ హైవేను 10 కింగ్​ పథ్​ కోసం ప్రైవేట్​ రహదారిగా నిర్మించారు. ఈ రోడ్డు ఎడారి మధ్యలో ఎలాంటి మలుపులు లేకుండా ఉంటుంది. 

    ఈ హైవే 10 చమురు, గ్యాస్​ నిల్వలకు ప్రసిద్ధి చెందిన నగరం హరద్​ నుంచి యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ సరిహద్దుకు సమీపంలో ఉన్న అల్​ బాతా వరకు ఉంటుంది. 
    గతంలో ఈ రికార్డును పశ్చిమ, దక్షిణ ఆస్ట్రేలియాలను కలిపే 146 కిలోమీటర్ల ఐర్​ హైవే పేరిట ఉండగా, ప్రస్తుతం సౌదీ అరేబియాలోని అతి పెద్ద ఎడారిలో ఉన్న ఈ హైవే 10 రికార్డుల్లోకెక్కింది. 
    గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​ ప్రకారం ఇది ఎలాంటి మలుపులు, వంపులు లేకుండా సూపర్​ స్ట్రెయిట్​గా ఉందని, దీనిపై సుమారు రెండు గంటలపాటు ప్రయాణించవచ్చని పేర్కొంది.