హైదరాబాద్‌లో పాస్‌పోర్టు అప్లికేషన్ల రద్దీ పెరుగుతుండటంతో జులై నెలలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు ఆర్పీవో కార్యాలయం ప్రకటించింది. ఇవి నాలుగు శనివారాల పాటు జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పీవోపీఎస్ కేంద్రాల్లో అపాయింట్మెంట్లను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. జులై 8న ఇందులో భాగంగా 3,641 జనరల్, తత్కాల్ అపాయింట్ మెంట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్పీవో బాలయ్య జులై 6 న మీడియాకు తెలిపారు.
కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారితో పాటు ఇది వరకే అపాయింట్మెంట్ పొందిన వారు తమ స్లాట్‌ను శనివారానికి మార్చుకోవచ్చని సూచించారు. బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌకి, నిజామాబాద్, కరీంనగర్ లో ఉన్న 14 కేంద్రాల్లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుందని వెల్లడించారు.