ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ఒకరు తీసుకుంటే చాలు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ పాస్ వర్డ్ షేర్ చేసుకొని వాడుకుంటుంటారు. అయితే, ఇకనుంచి అలా కుదరదు. పాస్ వర్డ్ షేరింగ్ ని అరికట్టడానికి నెట్ ఫ్లిక్స్ కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఇకనుంచి సబ్ స్క్రిప్షన్ అకౌంట్ ఉన్నవాళ్లు కూడా కొత్తగా వేరొక మొబైల్ లో లాగిన్ అయితే మళ్ళీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
పాస్ వర్డ్స్ షేర్ చేయడంవల్ల సబ్ స్క్రైబర్ల సంఖ్య తక్కువ, యూజర్ల సంఖ్య ఎక్కువ పెరిగిపోతోందట. దానివల్ల నెట్ ఫ్లిక్స్ ఏటా నాలుగు కోట్ల వరకు నష్టపోతోందట. ఆ నష్టాన్ని తగ్గించడానికి నెట్ ఫ్లిక్స్ సీఈఓ, కో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కొత్త రూల్ 2023 ఏప్రిల్ నుంచి అమలవుతుంది.