హ్యకర్ల నుంచి రక్షణ పొందడానికి పాస్‌వర్డ్స్ వాడుతుంటాం. అయితే.. ఇప్పుడు ఈ పాస్‌వర్డ్స్ కు బదులుగా గూగుల్ పాస్‌కీస్ తీసుకురాబోతోంది. ఈ ఫీచర్‌ని గూగుల్ క్రోమ్‌లో వినియోగించుకోవచ్చు. వినియోగదారులకు భద్రత కల్పించేది పాస్‌వర్డ్‌లే. అయితే..చాలామంది స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు కాకుండా మామూలు పాస్‌వర్డ్‌లు వాడడంతో ఫిషింగ్ అటాక్స్, మాల్‌వేర్ అటాక్స్, అకౌంట్ హ్యాకింగ్స్ ఎక్కువైపోతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఈ పాస్‌కీస్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
హ్యాకర్ల నుంచి రక్షణ పొందడానికి గూగుల్ 2-స్టెప్ వెరిఫికేషన్, గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌లను తీసుకొచ్చింది. అయితే.. సెక్యూరిటీ థ్రెట్‌ని పూర్తిగా పరిష్కరించడానికి గూగుల్ పాస్‌వర్డ్ రహిత అథెంటికేషన్ తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పాస్‌కీస్ గూగుల్ మేనేజర్ ద్వారా ఆటోమేటిక్‌గా సింక్రనైజ్ అవుతాయి. పాస్‌కీస్‌ని సేవ్ చేసిన తర్వాత సైన్‌ఇన్ చేస్తున్నప్పుడు పాస్‌కీస్ ఆటోఫిల్ అవుతుంది.
పాస్‌కీస్ ఆటోఫిల్ అవడం వల్ల హ్యాకర్లు పాస్‌వర్డ్ తెలుసుకొని హ్యాక్ చేసే అవకాశం ఉండదు. సర్వర్ దాడులు ఆగిపోతాయి. ఈ ఫీచర్‌ని ఇప్పటికే ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్‌లో టెస్ట్ చేస్తున్నారు.