
వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. ఈ క్రమంలో పసునూరి పార్టీని వీడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా ఇప్పటికే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన పసునూరి దయాకర్ పార్టీ మారాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ ను ఆయన కలిశారని సమాచారం. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన పసునూరి దయాకర్.. 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందారు.