మనం గర్జిస్తే ఢిల్లీ ప్రధాని సీటు కదలాలి: ‘మాలల సింహ గర్జన’లో పాశ్వాన్

సికింద్రాబాద్: పరేడ్ గ్రౌండ్స్లో ‘మాలల సింహ గర్జన’ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభకు తెలంగాణ, ఏపీ నలుమూలల నుంచి మాలలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ‘మాలల సింహ గర్జన’ సభలో ఢిల్లీ నుంచి వచ్చిన పాశ్వాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై మాలలు ఉద్యమిస్తారని తేలిపోయిందని, పార్లమెంట్లో మాలల గురించి చర్చ జరగాలని చెప్పారు. బహుజన దళితుల కోసం పోరాటం చేస్తున్నామని, తెలంగాణ, ఏపీలో కాదు ఢిల్లీలో చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ వరకు మాలల పోరాటం చేరితే మోదీ కుర్చీ కదలాలని పాశ్వాన్ నినదించారు. పరేడ్ మైదానం కాదని, పరేడ్ గ్రౌండ్స్ సరిపోక రోడ్డుపై మాలలు నిల్చొని సభను సక్సెస్ చేశారని హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘మాలల సింహ గర్జన’ సభ.. లైవ్ అప్డేట్స్..

మాలలు ఏకం కావడంతో మైదానం సరిపోలేదని, దేశంలోనే ఇంత మంది మాలలు ఒకే చోట చేరడం ఇదే మొదటి సారి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మైదానానికి తరలి వచ్చినట్టే ఢిల్లీకి రావాలని, తాము అండగా ఉంటామని పాశ్వాన్ చెప్పారు. మాలల హక్కులను కాలరాసేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని, సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగానే మాలల పోరాటం అని పాశ్వాన్ స్పష్టం చేశారు. మాలలు ఆత్మ బలిదానం కోసం అయినా సిద్ధంగా ఉండే వ్యక్తులని గుర్తుచేశారు. మాలల సంఖ్య ఎంత ఉందో ముందు తేల్చండని, మనం గర్జిస్తే ఢిల్లీలో ప్రధాని సీటు కదలాలని పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు సభకు హాజరైన మాలల్లో జోష్ నింపాయి.