IPL 2024 auction: కోట్లు కొల్లగొట్టిన కమిన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

IPL 2024 auction: కోట్లు కొల్లగొట్టిన కమిన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

ఐపీఎల్ వేలం ఎలా ఉంటుంది.. ఎలా పాడతారు.. పంతం ఎలా ఉంటుంది.. ఓ ఆటగాడి కోసం వేలంలో.. జట్లు ఎలా వ్యవహరిస్తాయి.. ఆటగాడి కోసం ఎంత ధర అయినా ఎలా పెడతారు అనటానికి.. క్రికెటర్.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ విషయంలో.. కళ్లారా చూపించింది ఐపీఎల్. 

పాట్ కమిన్స్.. 2 కోట్ల రూపాయలకు వేలం ప్రారంభం అయింది. అన్ని జట్లు కమిన్స్ కోసం పోటీకి దిగినా.. 10 కోట్ల తర్వాత అసలు సిసలు వేలం మొదలైంది. హైదరాబాద్ సన్ రైజర్స్.. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు వేలం సాగింది. 

కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. హైదరాబాద్ దగ్గర కేవలం 27 కోట్లు మాత్రమే ఉన్నాయి.. ఈ సమయంలో హైదరాబాద్ సన్ రైజర్స్.. భారీ మొత్తం చెల్లించకపోవచ్చనే ఉద్దేశంలో ఉన్న మిగతా జట్లకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ సన్ రైజర్స్. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 కోట్ల రూపాయల వరకు వచ్చింది.. ఆ తర్వాత 50 లక్షలు వేలం పెంచింది సన్ రైజర్స్.. ఇక్కడే బెంగళూరు వెనక్కి తగ్గింది. 20 కోట్ల కంటే ఎక్కువ చెల్లించలేమని వేలం నుంచి విత్ డ్రా అయ్యింది. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్.. కమిన్స్ ను 20 కోట్ల 50 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. 

పాట్ కమిన్స్ ఎంట్రీతో.. హైదరాబాద్ సన్ రైజర్స్ ఓ టెంపోను క్రియేట్ చేసినట్లు అయ్యింది. ప్రపంచ వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ పాపులారిటీ.. హైదరాబాద్ కు ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి...తీసుకోవడానికి ఫ్రాంచైజీలు అందరూ ఆసక్తి చూపించగా.. చివరకు 20 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది. 

ఇప్పటికే హెడ్ ను 6కోట్ల 80 లక్షలకు దక్కించుకున్న సన్ రైజర్స్, కమ్మిన్స్ కోసం 20.5 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 6 కోట్ల 7 లక్షలుమాత్రమే ఉన్నాయి.