IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్ కప్ కొడుతుందన్న కమ్మిన్స్

IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్ కప్ కొడుతుందన్న కమ్మిన్స్

ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనేమో. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్ లో ఉన్న స్టేడియాన్ని సైలెంట్ గా చేస్తామ అని చెప్పి చూపించాడు. భారత గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ కమ్మిన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ మ్యాచ్ లో ఆసీస్ ప్రదర్శన చూసిన తర్వాత కమిన్స్ ఛాలెంజ్ చేసి గెలిచి అది తనలో ఉన్న విశ్వాసం అని నిరూపించాడు.

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కమ్మిన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా సన్ రైజర్స్ జట్టు దూకుడుగా ఆరంభిస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో కేకేఆర్ కు ఆడిన అనుభవం తనకు పనికి వస్తుందని కమ్మిన్స్ అన్నాడు. కమ్మిన్స్ చెప్పినట్టుగానే సన్ రైజర్స్ ఈ సీజన్ లో అదరగొట్టేస్తుంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. తాజాగా కమ్మిన్స్ తెలుగు అభిమానులకు మరొక మాట ఇచ్చి తెలుగు అభిమానులను ఖుషీ చేశాడు.

ఐపీఎల్ నేడు (మే 2) రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు కమ్మిన్స్ కు ఇంటర్వ్యూలో  ఒక ప్రశ్న ఎదురైంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ టైటిల్ గెలుస్తుందా అని అడిగితే.. కమ్మిన్స్ ఖచ్చితంగా కొడుతుంది. లాక్ చేసుకోండి. అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కమ్మిన్స్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చివరిసారిగా 2016 లో రాయల్ ఛాలెంజర్స్ పై సన్ రైజర్స్ టైటిల్ గెలిచింది. 

సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. మరో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.