David Warner: నువ్వెళ్ళి బిగ్ బాష్ ఆడుకో.. వార్నర్‌కు కమ్మిన్స్ స్వీట్ పంచ్

టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఆస్ట్రేలియాకు అవసరమైతే అందుబాటులో ఉంటారని డేవిడ్ వార్నర్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వార్నర్ తిరిగి జట్టులోకి రావడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ అతని పునరాగమనాన్ని టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ తోసిపుచ్చాడు. ది గ్రేడ్ క్రికెటర్ పోడ్‌కాస్ట్‌లో వార్నర్ రిటర్న్ ఆఫర్‌పై కమ్మిన్స్ స్పందించాడు. ఇది కాస్త విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

జట్టు వార్నర్ కోసం ఆసక్తిగా ఉందని.. అతని కోసం సంప్రదింపులు జరుపుతామని కమ్మిన్స్ చమత్కరించాడు. "నేను రెండు రోజుల క్రితం డేవ్ (డేవిడ్ వార్నర్)తో మాట్లాడాను. అతను 'మీరు నా రిటైర్మెంట్ పై ఏమనుకుంటున్నారు?'అని అడిగాడు. నేను ఈ సంవత్సరం థండర్‌ (బిగ్ బాష్ లీగ్ ను ఉద్ద్యేశిస్తూ) తరపున ఆడుతున్న అతనికి గుడ్ లక్ చెప్పాను".అని వార్నర్ పై పంచ్ విసిరాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగే సమయంలోనే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరగనుంది. ఈ మెగా లీగ్ లో థండర్ టీంకు వార్నర్ ఆడనున్నాడు. 

ALSO READ | WA vs TAS: క్రికెట్ చరిత్రలో నమ్మలేని వింత.. ఒక్క పరుగుకే 8 వికెట్లు

కమ్మిన్స్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వార్నర్ తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు పని లేదని.. ఆ సమయంలో నువ్వు బిగ్ బాష్ లీగ్ ఆడుకో అని   చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంది. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత స్మిత్ ఓపెనర్ అవతారమెత్తినా.. ఆ ప్రయోగం ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మళ్ళీ అంతర్జాతీయ టెస్టులకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు.

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు.