అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే కెప్టెన్సీ వదిలేస్తా: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ వెటకారం

అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే కెప్టెన్సీ వదిలేస్తా: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ వెటకారం

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ క్రికెట్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ గా ఆస్ట్రేలియాకు బిగ్ టైటిల్స్ అందిస్తూ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఐపీఎల్ లో రూ. 20.5 కోట్ల ధరకు అమ్ముడుపోయి వేలంలో సంచలనంగా మారిన ఈ ఆసీస్ క్రికెటర్ తాజాగా.. సన్ రైజర్స్ కెప్టెన్ గా 2024 సీజన్ లో జట్టును నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తన కెప్టెన్సీకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో కివీస్ సొంత గడ్డపై ఓడిపోయింది. ఈ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఆసీస్ సారధి కమ్మిన్స్.. లియోన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన కెప్టెన్సీ గురించి కీలక ప్రకటన చేశాడు. లియాన్ 2027 వరకు టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించిన రోజున ఆస్ట్రేలియా కెప్టెన్సీని వదులుకుంటానని కమిన్స్ చెప్పడం షాకింగ్ కు గురి చేసింది.

సహచర ప్లేయర్ పై ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కాస్త వెటకారంగా అనిపించింది. కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. దీంతో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ అతడిపై నమ్మకముంచి కెప్టెన్ గా నియమించింది.