IPL 2025: ఈ సారి ఒక్కడే విదేశీయుడు.. ఐపీఎల్ 2025లో స్పెషల్ కెప్టెన్‌గా కమ్మిన్స్

IPL 2025: ఈ సారి ఒక్కడే విదేశీయుడు.. ఐపీఎల్ 2025లో స్పెషల్ కెప్టెన్‌గా కమ్మిన్స్

ఐపీఎల్ 2025 కి రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో ప్రపంచంలోని అతి పెద్ద టీ20 లీగ్ మొదలవుతుంది. అభిమానులు ఎంజాయ్ చేయడానికి.. ఆటగాళ్లు బౌండరీలు బాదడానికి ఎక్కువ సమయం లేదు. 10 జట్లు టైటిల్ సమరంలో పోరాడేందుకు సై అంటున్నాయి. ఈ సారి అజింక్య రహానే, పాట్ కమ్మిన్స్ మినహాయిస్తే తమ జట్లకు యంగ్ ప్లేయర్లే కెప్టెన్ కావడం విశేషం. శుక్రవారం (మార్చి 14) ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ ను తమ జట్టుకు కెప్టెన్ గా ప్రకటించడంతో అన్ని జట్ల సారధులు ఎవరో తెలిసిపోయింది. ఈ సారి ఐపీఎల్ లో ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే విదేశీ కెప్టెన్ కావడంతో అతను ప్రధాన ఆకర్షణగా మారాడు.  

ముంబై ఇండియన్స్ (హార్దిక్ పాండ్య), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( రజత్ పటిదార్), రాజస్థాన్ రాయల్స్ (సంజు శాంసన్),  కోల్‌కతా నైట్ రైడర్స్ (అజింక్య రహానే),పంజాబ్ కింగ్స్ (శ్రేయాస్ అయ్యర్), లక్నో సూపర్ జయింట్స్ (రిషబ్ పంత్),ఢిల్లీ క్యాపిటల్స్ (అక్షర్ పటేల్), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్), గుజరాత్ టైటాన్స్ (శుభమాన్ గిల్) జట్లకు ఇండియా ప్లేయర్స్ కెప్టెన్ కావడం విశేషం. కమ్మిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను నడిపించనున్నాడు. గత సీజన్ లో జట్టును ఫైనల్ కు చేర్చిన కమ్మిన్స్ పై మరోసారి సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నమ్మకముంచింది. దీంతో 2025 ఐపీఎల్ సీజన్ కు ఆసీస్ సారధి హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు.

ALSO READ | IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా సూర్య

ఐపీఎల్ 2025 సీజన్ 22న ప్రారంభమై మే 25న ముగియనుంది.  మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది. అదే రోజు రాత్రి మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి.