ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్ గెలిచింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున గిల్ క్రిస్ట్ సారధ్యంలో.. 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది. మన తెలుగు జట్టుకు ట్రోఫీ సాధించిన ఈ రెండు సార్లు కెప్టెన్ గా ఆసీస్ ఆటగాళ్లే కావడం విశేషం. తాజాగా తెలుగు అభిమానులు ఇదే సెంటి మెంట్ ను నమ్ముకొని ఉన్నారు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు కెప్టెన్ కమ్మిన్స్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.
కమ్మిన్స్ నేడు (మార్చి 19) హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో “ఎవరు ఇక్కడ ఉన్నారో చూడండి". అంటూ అతనికి స్వాగతం పలికింది. కమ్మిన్స్ హైదరాబాద్ చేరుకోవడంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. తమ జట్టుకు 2023 వరల్డ్ కప్ గెలిపించింది నవంబర్ 19. హైదరాబాద్ చేరుకుంది మార్చి 19 అని మరో సెంటిమెంట్ ను జత చేర్చారు. వరల్డ్ కప్ హీరో సహచరుడు ట్రావిస్ హెడ్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. రేపు (మార్చి 20) అతడు సన్ రైజర్స్ క్యాంప్ లో చేరతాడు.
ALSO READ :- సెలబ్రిటీ రిసార్ట్‌లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్
మార్కరం స్థానంలో కమ్మిన్స్ ను సన్ రైజర్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవమున్న కమ్మిన్స్ 2023 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు.. వన్డే వరల్డ్ కప్ అందించాడు. దీంతో కమ్మిన్స్ అనుభవాన్ని వాడుకోవాలని చూసిన సన్ రైజర్స్ యాజమాన్యం అతన్ని 2023 ఐపీఎల్ మినీ వేలంలో ఏకంగా రూ. 20.5 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
ఇప్పటివరకు 42 మ్యాచులాడిన కమిన్స్.. 18.95 సగటుతో 379 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 3 హాఫ్ సెంచరీలు ఉండడంతో పాటు 152.21 స్ట్రైక్-రేట్‌ను నమోదు చేశాడు. 8.54 ఎకానమీ రేటుతో 45 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మార్చి 23న కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది.
Pat Cummins is back to business!pic.twitter.com/59mDkqcZxX
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 19, 2024