ఐపీఎల్ నుంచి తప్పుకునే ఫారెన్ ప్లేయర్ల విషయంలో 10 మంది ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగబోయే ఐపీఎల్ నుంచి కొంతమంది విదీశీ ఆటగాళ్లు అనవసర సాకులు చెప్పి తప్పుకుంటున్నారని.. వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జట్ల ఫ్రాంచైజీలు గతంలో చెప్పుకొచ్చారు. వీరి అభ్యర్ధనను బీసీసీఐ గౌరవించింది. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకునే విదేశీ క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.
ఐపీఎల్ తాజా నియమం ప్రకారం వేలంలో ఎంపిక చేయబడిన విదేశీ ప్లేయర్.. సీజన్ ప్రారంభానికి అందుబాటులో లేకపోతే టోర్నమెంట్ నుండి నిషేధించబడతాడు. అంతే కాదు ఆ తర్వాత జరగనున్న రెండు ఐపీఎల్ సీజన్ ఆడడానికి వీలు లేదని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ రూల్ పై తాజాగా ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్, సన్ రైజర్స్ సారధి ప్యాట్ కమ్మిన్స్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
"ఈ సీజన్ ఎలా ఉంటుందో ఇప్పుడే నేను చెప్పలేను. కొత్త రూల్స్ వచ్చాయి. ఇప్పటివరకు నేను ఐపీఎల్ ఆక్షన్ ముగిసిన తర్వాత తప్పుకోలేదు" అని సన్ రైజర్స్ కెప్టెన్ అన్నాడు. ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా వస్తే కమ్మిన్స్ ఐపీఎల్ ఆడతాడా అనే విషయంలో అనుమానాలు ఉన్నాయి. మే ఎండింగ్ లో ఐపీఎల్ ముగుస్తుంది. మరో 10 రోజులకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమవుతుంది. అయితే తాజాగా కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అతను ఐపీఎల్ మధ్యలో వెళ్లే అవకాశం లేదనిపిస్తుంది.
ALSO READ : IND vs AUS: చిగురిస్తున్న సెమీస్ ఆశలు.. భారత్ మ్యాచ్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్లు దూరం
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాన్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. వానింద్ హసరంగా సైతం గాయం కారణంగా తప్పుకోవడంతో సన్ రైజర్స్ జట్టు స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపించింది. జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగా, ముజీబ్ ఉర్ రెహమాన్, ఆడమ్ జంపా, మార్క్ వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో తక్కువకు అమ్ముడవ్వడంతో ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. వ్యక్తిగత కారణాలు, గాయాలు వంక చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీనిపై ఫ్రాంచైజీలు సంతోషంగా లేరు.
Pat Cummins on BCCI's new rule to ban overseas players 🗣️ pic.twitter.com/I38I0LufFf
— CricketGully (@thecricketgully) October 12, 2024