IPL 2025: ఐపీఎల్‌కి సిద్ధం.. గుడ్ న్యూస్ చెప్పిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్

IPL 2025: ఐపీఎల్‌కి సిద్ధం.. గుడ్ న్యూస్ చెప్పిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్

ఐపీఎల్ కు ముందు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తెలుగు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అతను త్వరలోనే పూర్తిగా కోలుకున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. బౌలింగ్ తిరిగి ప్రారంభించానని.. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాని చెప్పాడు. ఐపీఎల్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం తాను సిద్ధమవుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్ సమయానికి అందుబాటులో ఉండడమే తన లక్ష్యమని ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. గాయపడిన తన చీలమండకు శస్త్రచికిత్స గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని.. వీలైనంత త్వరగా బౌలింగ్ తిరిగి ప్రారంభించాలని కమ్మిన్స్ చెప్పాడు.

భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కమ్మిన్స్ కు చీలమండ గాయం అయింది. ఈ సిరీస్ లో కమ్మిన్స్ 167 ఓవర్లు బౌలింగ్ వేశాడు. గాయం తర్వాత అతను నిన్నటివరకు ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌‌లకు కూడా  విశ్రాంతి తీసుకున్న కమ్మిన్స్.. గాయం నుంచి కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. కమ్మిన్స్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేస్తున్నాడు. కమ్మిన్స్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్.ఈ ఆసీస్ సారథికి రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంది. 

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ జట్టును కమ్మిన్స్ ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ గా, బౌలర్ గా అద్భుతంగా రాణించి జట్టును తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. అయితే ఈ సారి గాయం కావడంతో నిన్నటివరకు కమ్మిన్స్ ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. తన గాయంపై తాజాగా అప్ డేట్ ఇస్తూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.