SRH vs LSG: సిక్సర్లతో దుమ్ములేపిన కమ్మిన్స్.. ధోనీ, పూరన్ సరసన సన్ రైజర్స్ కెప్టెన్

SRH vs LSG: సిక్సర్లతో దుమ్ములేపిన కమ్మిన్స్.. ధోనీ, పూరన్ సరసన సన్ రైజర్స్ కెప్టెన్

సన్ రైజర్స్ కెప్టెన్ పాటు కమ్మిన్స్ కెప్టెన్సీ, బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా సత్తా చాటగలడు. ఐపీఎల్ లో ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ కు 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ కూడా ఉంది. జట్టుకు అవసరమైన సమయంలో క్యామియో ఇన్నింగ్స్ లు ఆడుతూ తనలోనూ ఒక పవర్ హిట్టర్ ఉన్నాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించాడు. నేడు (మార్చి 27) ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జయింట్స్ తో  జరుగుతున్న మ్యాచ్ లోనూ సిక్సర్లతో ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన కమ్మిన్స్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన కమ్మిన్స్.. 18 ఓవర్ రెండో బంతికి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో మరో సిక్సర్ బాదాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు కమ్మిన్స్ కంటే ముందు ముగ్గురు మాత్రమే తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచారు. 2021 లో సునీల్ నరైన్ మొదటి సారి ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత పూరన్,ధోనీ ఈ ఫీట్ అందుకున్నారు. తాజాగా కమ్మిన్స్ ఈ ముగ్గురి సరసన చేరాడు. 

Also Read : అయ్యో ఇంత బ్యాడ్ లక్ ఏంటి

తొలిమూడు బంతులను సిక్సర్లుగా బాదిన కమ్మిన్స్.. తర్వాత బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32) యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ (36) రాణించగా.. మిగితా బ్యాటర్లు విఫలం అయ్యారు. స్టార్ బ్యాటర్ క్లాసెన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివర్లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 5 సిక్సుర్లు బాది మెరుపు ఇన్సింగ్స్ ఆడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 18 పరుగులు చేశాడు.