టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లో భాగంగా ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తో మెరిశాడు. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో.. కమ్మిన్స్ ఈ ఫీట్ సాధించాడు. 18 ఓవర్ చివరి రెండు బంతులకు.. 20వ ఓవర్ తొలి బంతికి వికెట్ తీసుకొని వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించిన ఏదో బౌలర్ గా నిలిచాడు. దీంతో ఈ వరల్డ్ కప్ మనకే అని టీమిండియా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అదేంటి ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తెస్తే ఇండియాకు వరల్డ్ కప్ ఎలా వస్తుందనే అనుమానం అందరిలో ఉంది. అయితే ఇది కేవలం సెంటిమెంట్ మాత్రమే. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా ఇప్పటివరకు ఒకేసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికా వేదికగా 2007 లో నిర్వహించిన తొలి వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకొని ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల తర్వాత మరో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ సారి కూడా ప్రత్యర్థి బంగ్లాదేశ్ కావడం విశేషం. దీంతో 2007 టీ20 వరల్డ్ కప్ లో జరిగిన సీన్ మరోసారి రిపీటవ్వడంతో ఈసారి టీమిండియాదే వరల్డ్ కప్ అనే సెంటి మెంట్ మనోళ్ళలో బాగా నాటుకుపోయింది.
వరల్డ్ కప్ లో ప్రస్తుతం టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గ్రూప్ మ్యాచ్ ల్లో ఒక్క ఓటమి లేకుండా ముగించిన రోహిత్ సేన అదే ఊపును సూపర్ 8లో కొనసాగిస్తోంది. గురువారం (జూన్ 20) ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ లేదా వెస్టిండీస్ లో ఒక జట్టు భారత్ ప్రత్యర్థి అవ్వొచ్చు. చివరిసారిగా జరిగిన 2022వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఓడిపోయింది. మరి ఈ సారైనా వరల్డ్ కప్ కళను నెరవేరుస్తుందేమో చూడాలి.
Will Team India lift the T20WC Trophy again in 2024? pic.twitter.com/K5U5zRXUhF
— D E N I S H • L A L 🌴☀️🌷 (@banand84) June 21, 2024