
ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. శనివారం జరగనున్న రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ సీజన్ తొలి మ్యాచ్ ఆడనున్నారు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపించడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాత్రి 7:30గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఆసీస్ స్టార్ ప్లేయర్లు కమ్మిన్స్, స్టార్క్ పైనే ఉంది.
వరల్డ్ బెస్ట్ బౌలర్లు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచిన మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ లు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయారు. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) యాజమాన్యం రూ.24.75 కోట్లు వెచ్చించి అతన్ని చేజిక్కించుకుంది.
Also Read:ఢిల్లీతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్
మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. వీరు తమ ధరకు న్యాయం చేస్తారా లేదా అనేదానిపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్టార్క్, కమ్మిన్స్ ప్రత్యర్థులుగా ఆడటం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. స్టార్క్ ఐపీఎల్ ఇప్పటివరకు 27 మ్యాచ్ ల్లో 37 వికెట్లు తీశాడు. కమ్మిన్స్ 42 మ్యాచ్ ల్లో 45 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరపున ఎనో విజయాలను అందించిన వీరిద్దరూ తమ జట్లకు ఎంత కీలకంగా మారతారో చూడాలి.
Cummins vs Starc: Top earners enter new 'weird' chapter https://t.co/jUKpc6WPIm#cricketdaily
— Sivakumar V (@veeyeskay) March 23, 2024