యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు అధికారులు, అర్చకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేయనున్నారు.
15న ఉదయం తిరుమంజనం, సాయంత్రం తొళక్కం, 16న ఉదయం తిరుమంజనం, సాయంత్రం దివ్యప్రబంధ సేవాకాలం, 17న తిరుమంజనం, సాయంత్రం పరమపద ఉత్సవం, 18న ఉదయం నిర్వహించే నూత్తందాది చాత్మరా పూజలతో ఉత్సవాలు ముగియనున్నాయి. 19న స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.