
టికెట్ కన్ ప్యూజన్ లో పడ్డారట పటాన్ చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి. ఓ దిక్కు కేసులు.. మరోదిక్కు ప్రత్యర్థుల దూకుడుతో పరేషాన్ అవుతున్నారట. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా ఎమ్మెల్యేను చికాకు పెడుతున్నాయట. వీటన్నింటినీ సాకుగా చూపి అధిష్టానం టికెట్ కు ఎసరు పెట్టే ప్రమాదం ఉందని గూడెం వర్గం భయపడుతోందంట. మహిపాల్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా మరో నేతను మంత్రి కేటీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారనే టాక్ కూడా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోందంట.
మొన్నటిదాక సెగ్మెంట్ లో తనకు పోటీయే లేదనుకున్నాడట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అంతా బాగుందనుకున్న టైమ్ లో సడెన్ గా వస్తున్న సవాళ్లతో టెన్షన్ పడుతున్నారట. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో ఎమ్మెల్యే ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారట. సమస్యలు చెప్పకుందామని జనం వస్తే.. ప్రస్టేషన్ తో దురుసుగా మాట్లాడుతున్నారట. ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తిస్తారనే పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ప్రస్టేషన్..ఈ మధ్య పీక్ లెవెల్ కు పోయిందని క్యాడరే చెప్పుకుంటోందట.
వరుస వివాదాలు, కేసులు, స్వపక్షంలో నేతల టికెట్ ప్రయత్నాలతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. మహిపాల్‌రెడ్డి తరపున ఆయన సోదరుడు ఇంటింటికీ తిరుగుతున్నారట. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ.. కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారట. హైదరాబాద్ పక్కనే ఉండటం, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ఏరియా కావడంతో ఎమ్మెల్యే ఎవరిని పెద్దగా లెక్కచేయడంట. భూకబ్జాల ఆరోపణలు ఉన్నా ఇన్నాళ్లు అధిష్టానం సైతం సైలెంట్ గానే ఉందంట. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయిందని పటాన్ చెరు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయట.
https://www.youtube.com/watch?v=viITUyrvccE