భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

రామచంద్రాపురం, వెలుగు : అమీన్​పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మున్సిపల్  కార్యాలయాలకు సంబంధించిన స్థలాలను పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు రెండు ఎకరాలు, పోలీస్ స్టేషన్ కు రెండు ఎకరాలు, మున్సిపల్ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయించామని తెలిపారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

మూడు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, తహసీల్దార్​రాధ, సీఐ నాగరాజు, కౌన్సిలర్లు ఉన్నారు.