
పటాన్చెరు, వెలుగు : కాంగ్రెస్ పటాన్చెరు అభ్యర్థిగా హై కమాండ్ నీలం మధును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం మధు ఢిల్లీ నుంచి పటాన్చెరు తిరిగి రావడంతో ఆయన అభిమానులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ముత్తంగి రింగ్‌రోడ్డు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ముత్తంగి నుంచి రుద్రారంలోని గణేశ్‌గడ్డ గణపతి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఆయన తరపున ఆయన సతీమణి కవిత నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.