Sankranti Special: పతంగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటీ.. ఎందుకు జరుపుకుంటారు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

పతంగ్ అంటే ఒక దారంపోగు... దానిచివర కట్టిన కాగితమ్ముక్క అంతే... కానీ అది ఒక 'బచ్‎పన్ కీ యాద్. పతంగ్ ఎగరేయటం అంటే పిల్లలకి ఆనందమే కానీ దాన్ని తయారు చేయటం మాత్రం పిల్లలాట కాదు. దాన్నికి కన్నాలు లేదా కళ్ళాలు అనే దారం కట్టడం కూడా స్కిట్వర్క్, ఒక్కముక్కలో చెప్పాలంటే... మేకింగ్ ఆఫ్ నతంగ్ ఈజ్ యాన్ ఆర్ట్.

ఇఫ్పుడంటే పంకుల్ క్రిష్టా అని వేర్వేరు రాష్ట్రాలనుండి ఇంపోర్ట్ చేసుకొని ఒక్కొక్క పతంగ్ 100, 200 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం గానీ ఇప్పటికీ మన పల్లెల్లో అట్లనే ఉంది. రంగు కాగితాలతో, ప్లాస్టిక్ పేపర్లతో చేసే పతంగు వచ్చేసాక కొన్ని జ్ఞాపకాలతో దూరం పెరిగిపోయింది.. రెండు కొబ్బరి చీపురు పుల్లలు. కొన్ని అన్నం మెతుకులు, ఒక న్యూస్ పేపర్తో తో పతంగ్ తయారు చేసుకున్న రోజుల్లోకి మళ్లీ వెళ్తే ఎంత బాగుండు.. 'ఇల్లంతా అంగడి చేస్తున్నరు' అని అమ్మకొట్టినా ఓ ఆనందమే ఇన్నాళ్లకి ఊరికి వెళ్లినా పట్నంలోనే ఉన్నా పతంగుల పండుగ ఆనందం మాత్రం మారదు. అందుకే పతంగుల సీజన్‎లో కొన్ని ముచ్చట్లు.

ALSO READ | Sankranti 2025: సంక్రాంతి ముగ్గులకు ఇంత కథ ఉందా..

జనవరిలో గాలి పటాలు ఎగరేసేందుకు ప్రకృతిలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గాలిలో తేమ, పొడి శాతం తక్కువగా ఉండడం. గాలి పటాలు నిలకడగా ఎగిరేందుకు అనువుగా ఉండే వాతావరణం కాబట్టి దీన్ని పతంగుల సీజన్ అంటారు.. మాంజాలూ, రంగురంగుల పతంగ్‎లూ ఏ మైదానం ఉండకపోయినా ఇంటి పైకప్పే ఆటల మైదానం అయిపోతుంది. సుమారు రెండు వేల. ఏళ్ల చరిత్ర ఉంది పతంగ్ల కి పట్టుగుడ్డలతో పుట్టిన పతంగ్ తర్వాత పేపర్ తో పెరుగుతూ మనదేశానికి వచ్చింది. మనదేశంలో ప్రతి ఏటా గుజరాత్లోని అహ్మదాబాద్ లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి.

ALSO READ | Sankranti Special : మకర సంక్రాంతిపై పురాణాల్లో ఏముందీ.. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏంటీ.. ఆచారం వెనక ఆరోగ్యం ఎలా..!

సంక్రాంతి పండక్కి పిల్లలు సరదాగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు. అయితే సరదా సమయంలోనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. గాలి పటం రోడ్ల మీద పరిగెత్తితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. కొండకు దాన్ని నోట్లో పెట్టుకుంటాడు. అలా చేయడం వల్ల పెదవులు కోసుకు పోయే ప్రమాదం ఉంది. కరెంటు తీరలు వేలాడే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేడ మీద పతంగులను ఎగరేసేటప్పుడు గాల్లో ఎగిరే పతంగ్ మీదే దృష్టి పెట్టి పడిపోయే ప్రమాదాన్ని చూసుకోరు. జాగ్రత్తగా ఉండాలి.

పక్షులకు జంతువులకు ప్రమాదం కలగకుండా ఎగరేయాలి. అన్నిటికీ మించి పతంగి బడాయికి దూరంగాఉండాలి, గాలి పటాలు ఎగరేసిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. రంగురంగుల దారాన్ని రసాయనాలతో తయారుచేస్తుంటారు. దుమ్ము ధూళి పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పల్లె అయినా పట్నం అయినా చైనా మాంజాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

హైదరాబాదీ పతంగ్

ప్రతీ ఏటా హైదరాబాద్‎లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ చేస్తుంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతోంది. కైట్ ఫెస్టివల్ పాటు స్వీట్స్ ఫెస్టినల్ కూడా ఉంటుందిక్కడ.
400 ఏళ్ల క్రితమే గోల్కొండ కోటలో కుతుబ్షాహీ పాలకులు వడంగులు ఎగురవేశారు. హైదరాబాద్ నగరం ఏర్పాటు తర్వాత ఆసిఫ్ జాహ్ పాలనాకాలంలో పతంగ్ పోటీలు నిర్వహించారు. ఇవి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా పతంగం పోటీలు జరిగేవి. 150 ఏళ్ల క్రితమే వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి పతంగు తయారుచేయడానికి వందలాది కుటుంబాలు వలస వచ్చాయి.

ఇట్ల తయారు చేయొచ్చు..

కలర్ పేపర్-1 షీట్.. ఫెవికాల్ లేదా గమ్, 2. కొబ్బరి చీపురుపుల్లలు లేదా వెదురు పుల్లలు కూడా వాడొద్దు. ఒక పేపర్ త్రిభుజాకారంలో మడతపెట్టి చివరన ఎక్కువగా ఉన్న కవర్‎ను కట్ చేయాలి. ఇప్పుడు చీపురుపుల్ల లేదా వెదురు పుల్లకి ఫెవికాల్ రాసి పేపర్ని రెండు త్రిభుజాలుగా విడదీసే విధంగా మధ్యలో అతికించాలి. తర్వాత.. ఇంకో చీపురుపుల్లని మధ్యలో అతికించన పుల్లకి అడ్డంగా ఆటు చివర, ఇటు చివర వచ్చేటట్టు ఫెవికాల్ రాసి అతికించాలి. ఇప్పుడు దానికి కిందివైపున పొడుగ్గా కట్ చేసిన పేపర్స్ తోకలా అతికించాలి. అంతే పతంగ్ రెడీ.

ALSO READ | Sankranti Special: భోగి మంట ఎందుకు వేస్తారు.. పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు.. విశిష్ఠత తెలుసుకుందామా..!

క్రమంగా పూణె, ముంబై, కోటీతతా. ఢిల్లీలతో సహా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలలోనూ జరుగుతున్నాయి.. అహ్మదాబాద్లో సంక్రాంతి రోజున 'ఉత్తరాయన్'గా పిలిరే అంతర్జాతీయ పతంగుల పండుగలో దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది పాల్గొంటారు.అహ్మదాబాద్ లోని 'పతంగ్ బజార్ ఈ పండుగకు వారం రోజుల ముందు నుంచీ గాలిపటాలు కొనేవాళ్లూ మేతో వీటకిటలాడిపోతుంది. అంతేకాదు. చాలా వరకు ఇళ్లలోనే రంగురంగులు గాలిపటాలను తయారుచేసి వాటిని ఇంటి ముందే పెట్టి అమ్ముతారు. 1989 నుంచీ అక్కడ ఏటా ఈ వేడుక జరుగుతోంది.

పతంగుల్లో చాలా రకాలున్నాయి.

పతంగ్ అంటే పతంగ్ అంతే అనుకుంటాం. గానీ ఒకటి రెండూ కాదు చాలా రకాల పతంగ్లు ఉంటాయి. వీటి గురించి చెప్పగలిగేది పతంగ్ ప్లేయర్స్ మాత్రమే. నామందార్, జీవా, లంగోటి గుర్తందార్, గుడ్డి లంగోటి, దోరేదార్, అర్ధా' ఇలా మస్తీ వెరైటీలు.

• అపరంగ్ మీద ఏదో ఒక రంగులో నామం ఉంటే అది నామందార్! 
• పతంగ్ కింద కుచ్చుల లాంటి చిన్న జోక డిజైన్ ఉంటే అది లంగోటి
•పతంగ్ గుద్దిందార్ అంటే రెండు కళ్లున్ను పతంగ్. రెండు కళ్లతోని మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. గుడ్లు ఉరిమి చూడటం అంటాం. కదా అట్లా మన వైపు చూసే కళ్లు ఉంటాయియి. కాబట్టి అది గుద్దిందార్ రెండు కళ్లకి బదులు ఒకటే కన్నుంటే అది గుడ్డి లంగోజ్.. 
• నిలువుగా లేదంటే అర్ధంగా రంగురంగుల గీతలుంటే దాన్ని జనియద్ పతంగ్ అనాలి. అరంగురంగుల కాయితాలతో చేసేది డోరేదార్, పర్లీ పతంగ్ ని గుట్కా పేపర్ తో చేస్తారు.. అద్దా అంటే పెద్ద పతంగ్.
ఇవేకాకుండా ప్రతీ సంవత్సరం కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. మేకర్ క్రియేటివిటీని బట్టి కొత్తకొత్త మోడల్ పతంగులు కూడా దొరుకుతాంబ. దుల్హన్ జీవియా బంగోన్. చాక్ ఆంభ, సూపర్విన్, స్ట్రెదర్శన్, బ్యాట్ మేన్ లాంటి కార్టూన్ నెట్ వర్క్ గాలిపటాలు.. బాలీవుడ్ హీరోలు అందరూ ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తారు...