![పతంగ్ మూవీ టీజర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2024/05/patang-movie-teaser-release_Shjlqoi0eZ.jpg)
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తపాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా హిట్ అనిపిస్తుంది. సినిమాకు యూత్‌ఫుల్ వైబ్ కనిపిస్తుంది.
మరో ‘హ్యాపీడేస్’లా ఘనవిజయం సాధిస్తుందని భావిస్తున్నా’ అని చెప్పాడు. ‘కొత్తవాళ్లం నటించిన చిత్రమిది. ఈ సినిమాకు కథే హీరో’ అని నటీనటులు అన్నారు. ఈ సినిమాతో థియేటర్స్‌లో యూత్ ఫెస్టివల్స్ జరుగుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి, ఆటా సందీప్ మాస్టర్, సిరిసిల్ల రాజయ్య, నటి శాన్వి, రవిప్రకాష్, చైతన్య ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం సాధించాలని కోరారు.