నేరడిగొండ, వెలుగు: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పిలుపునిచ్చారు. నేరడిగొండలో పార్టీ ఆఫీస్‌ను బుధవారం ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు .
ప్రజల్లో బీజేపీపై సానుకూలత ఉందని, కార్యకర్తలు కష్టపడితే ఆదిలాబాద్ ఎంపీ సీటు మరోసారి ఖాయమన్నారు . కార్యక్రమంలో నేతలు సాబ్లే సంతోష్ సింగ్, తీగల నవీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .