
- ఆదర్ పూనావాలా సనోటి
- ప్రాపర్టీస్ వాటాను కొనేందుకు డీఎస్ గ్రూప్‌తో జత
- డీల్ విలువ రూ.4,500 కోట్లi
న్యూఢిల్లీ: యోగా గురు రామ్‌దేవ్ బాబా ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద్ ధరమ్‌పాల్ సత్యపాల్ గ్రూప్ (డీఎస్ గ్రూప్)తో కలిసి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌లోని ఆదార్ పూనావాలా వాటాను కొనుగోలు చేయనుంది. సనోటి ప్రాపర్టీస్ ఎల్‌ఎల్‌పీ నుంచి రూ.4,500 కోట్లకు కొనుగోలు చేస్తామని పతంజలి ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఆదార్ పూనావాలాకి చెందిన సనోటి ప్రాపర్టీస్, రైజింగ్ సన్ హోల్డింగ్స్ జాయింట్ వెంచర్ కంపెనీ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు సెలికా డెవలపర్స్, జాగ్వర్ అడ్వైజరీ సర్వీసెస్‌లను కూడా పతంజలి–డీఎస్ గ్రూప్ దక్కించుకోనున్నాయి. వివిధ కేటగిరీల్లో ఇన్సూరెన్స్ పాలసీలను మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ అమ్ముతోంది.