న్యూఢిల్లీ: ఫుడ్సేఫ్టీ అండ్స్టాండర్డ్స్ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూల్స్ప్రకారం లేని నాలుగు టన్నుల కారం పొడి ప్యాకెట్లను వెనక్కి తెప్పిస్తున్నామని పతంజలి ఫుడ్స్ప్రకటించింది. ఒక బ్యాచ్ (ఏడీజే2400012)ప్యాకెట్లలో పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ వాటిని వాపసు తీసుకొని డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో పతంజలి డిస్ట్రిబ్యూటర్లను అప్రమత్తం చేసింది. కారం పొడి వాపసు గురించి పోస్టర్లు వేసింది. ఇక నుంచి ఇలాంటి సప్లై రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించింది.
200 గ్రాముల ప్యాకెట్లలో 4 టన్నుల ఎర్ర కారం పొడిని తక్కువ పరిమాణంలో కంపెనీ రీకాల్ చేసిందని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ అస్థానా తెలిపారు.పరీక్షించినప్పుడు ఉత్పత్తి నమూనాలు పురుగుమందుల అవశేషాల గరిష్ట అనుమతి పరిమితికి అనుగుణంగా లేవని తేలింది. ఎర్ర మిరపకాయతో సహా వివిధ ఆహార పదార్థాల కోసం పురుగుమందుల అవశేషాల కోసం FSSAI గరిష్ట అవశేషాల పరిమితులను (MRLలు) సెట్ చేసిందని అస్థాన చెప్పారు.