
పటాస్ యాదమ్మ రాజు(Yadamma raju) ఎమోషనల్ అయ్యారు. తనకు చదువు చెప్పిన గురువు మరణంతో విషాదం మునిగిపోయారు. అయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
అక్టోబర్ 3 నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి వరకు చదువు చెప్పిన మా గురువు ఇక లేరు. నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలనేది ఆయనే నేర్పించారు. ఏదైనా తప్పు చేస్తే కొట్టి మరి సరి చెయించారు. సమాజంలో క్రమశిక్షణతో ఎలా ఉండాలో కూడా ఆయనే నేర్పించారు. నేను స్కూల్ ఫీజ్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. ఆయనే కట్టి నన్ను చదివించారు. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం ఆయన నన్ను నడిపించిన తీరే. అలాంటి మా ప్రిన్సిపాల్ సర్ ను చాలా మిస్ అవుతున్నా.. రెస్ట్ ఇన్ పీస్ డా.ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ సర్.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు యాదమ్మ రాజు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.