దళితబంధు కమీషన్లపై ఎంక్వైరీ చేయాలి: పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల, వెలుగు: జిల్లాలో దళితబంధు స్కీం కమీషన్లు, అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్  పటేల్  ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితబంధు స్కీమ్​పై కోర్టుకు పోతే కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదేశించిందని చెప్పారు. అన్ని జిల్లాల్లో దళితబంధు స్కీమ్​లో కమీషన్ల దందా కొనసాగుతోందన్నారు. వీటిపై ఎంక్వైరీ చేసి అర్హులకే స్కీం మంజూరు అయ్యేలా చూడాలని, కమీషన్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ALSO READ: తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

ప్రజల కష్టాలు పట్టించుకుంటలేరు..

ప్రజల కష్టాలు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని డీసీసీ ప్రెసిడెంట్ పటేల్  ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సభకు ఆర్టీసీ, స్కూల్ బస్సులను తీసుకెళ్లడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా సభలు నిర్వహించాలే తప్ప, ఇలా అధికార దుర్వినియోగం చేయడమేమిటన్నారు. శంకర్, ఇసాక్, జమాల్  పాల్గొన్నారు.