అవినీతికి  కేరాఫ్ మంత్రి జగదీశ్ రెడ్డి : పటేల్ రమేశ్ రెడ్డి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతికి  కేరాఫ్‌గా మారారని, సూర్యాపేట నియోజకవర్గంలో ల్యాండ్, సాండ్, మైన్, వైన్ మాఫియా రాజ్యం నడుస్తోందని  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి ఆరోపించారు. గడప గడపకు కాంగ్రెస్‌లో భాగంగా  శుక్రవారం సూర్యాపేట టౌన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌ అన్నివర్గాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే   రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళకు రూ. 500-లకే గ్యాస్ సిలిండర్,  రూ.4 వేల ఆసరా పెన్షన్లు,   ఇందిరమ్మ ఇంటికి రూ.  5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.