సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రమేశ్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేశ్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాలువా, బొకేతో సన్మానించారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్​రెడ్డితోపాటు జిల్లా మంత్రులకు రమేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.