సూర్యాపేట, వెలుగు: బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన యువత కాంగ్రెస్ వైపు చూస్తోందని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి చెప్పారు. ఆత్మకూరు మండలం ఏపూర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఏపూర్‌ను దత్తత తీసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. ఏమి చేయకపోవడంతోనే గ్రామ యువకులు కాంగ్రెస్‌లో చేరారని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పేటకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవిరే వెంకన్న, యాసారపు రవి, మహేశ్ , గట్టు శ్రీనివాస్, స్వామి నాయుడు, అరవింద్ రెడ్డి, విజయ్, ధర్మ, కొమ్ము సైదులు, ఎరుకల మధుసూదన్, మహేశ్, శ్రీకాంత్, రవి, నాగరాజు, నవీన్, ప్రసాద్, బాలు పాల్గొన్నారు.
ALS0 READ: ఎమ్మెల్యే భగత్ కృషితో తండాల అభివృద్ధి: రాంచంద్రనాయక్