ఆటమ్‌‌ బైక్‌‌కు పేటెంట్‌‌!

ఆటమ్‌‌ బైక్‌‌కు పేటెంట్‌‌!
  • డిజైన్ పరంగా దక్కించుకున్న విశాక ఇండస్ట్రీస్‌‌‌‌
  • పేటెంట్ వ్యాలిడిటీ 20 ఏళ్లు ఆటమ్‌‌‌‌ ఛార్జ్ పేరుతో త్వరలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు 
  • ఇప్పటికే ఆటమ్‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ రూఫ్‌‌‌‌ కోసం ఇండియా, సౌత్‌‌‌‌ ఆఫ్రికాలో పేటెంట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్‌‌‌‌లను తీసుకొస్తున్న  విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కు మరో పేటెంట్‌‌‌‌ దక్కింది. కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్  ఆటమ్‌‌‌‌ 1.0 కు డిజైన్ పరంగా  పేటెంట్ వచ్చింది. దీంతో దేశంలో ఇంక ఏ కంపెనీ కూడా ఆటమ్‌‌‌‌ బైక్ డిజైన్‌‌‌‌ను కాపీ కొట్టడానికి వీలుండదు. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ లైట్ వెయిట్‌‌‌‌తో పాటు ఇతర బైక్‌‌‌‌ల కన్నా డిఫరెంట్ స్టైల్‌‌‌‌లో ఆకర్షణీయమైన డిజైన్‌‌‌‌తో వచ్చింది. బైక్‌‌‌‌ ఫ్యూయల్ ట్యాంక్‌‌‌‌ను స్టోరేజ్ ట్యాంక్‌‌‌‌ మాదిరి వాడుకునేలా డిజైన్ చేశారు. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌‌‌‌కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్‌‌‌‌ నుంచి పేటెంట్ రైట్స్ దక్కాయి. ఈ పేటెంట్ వ్యాలిడిటీ 20 ఏండ్ల పాటు ఉంటుంది.  ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుండటంతో ఆటమ్ చార్జ్ పేరుతో దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని విశాక ఇండస్ట్రీస్ ప్రకటించింది. 
ఆటమ్‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ రూఫ్‌‌‌‌కు ఎప్పుడో..
ఇప్పటికే ఆటమ్‌‌‌‌  సోలార్ బోర్డ్స్‌‌‌‌కు ఇండియా పేటెంట్ ఆఫీస్‌‌‌‌, సౌత్ ఆఫ్రికా పేటెంట్ ఆఫీస్‌‌‌‌ల నుంచి పేటెంట్ రైట్స్‌‌‌‌ దక్కాయి. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ పేటెంట్ ఆఫీస్‌‌‌‌ నుంచి, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో సౌత్‌‌‌‌ ఆఫ్రికా పేటెంట్ ఆఫీస్‌‌‌‌ నుంచి 20 ఏళ్లకు గాను పేటెంట్‌‌‌‌ రైట్స్‌‌‌‌ను విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ పొందింది.  పర్యావరణానికి హాని చేయకుండా ఎనర్జీని ప్రొడ్యూస్‌‌‌‌ చేసుకోవడానికి వీలుండడంతో ఈ పేటెంట్‌‌‌‌ను ఆటమ్‌‌‌‌ రూఫ్‌‌‌‌ దక్కించుకుంది. చైనా, యురోపియన్ యూనియన్ దేశాలలో కూడా పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేశామని విశాక ఇండస్ట్రీస్ పేర్కొంది. త్వరలోనే ఆయా దేశాల్లో పేటెంట్ రైట్స్ పొందుతామని తెలిపింది. సోలార్‌‌‌‌ ‌‌‌‌రూఫ్‌‌‌‌ టెక్నాలజీపై గత ఐదేళ్ల  నుంచి విశాక ఇండస్ట్రీస్ పనిచేస్తోంది. సాధారణ సోలార్‌‌‌‌‌‌‌‌ ప్యానళ్లతో  పోలిస్తే 22 నుంచి 40 శాతం వరకు ఎక్కువ కరెంటును ఆటమ్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేబొరేటరీ యూఎల్‌‌‌‌ ‌‌‌‌2019 లోనే సర్టిఫై చేసింది. అగ్ని ప్రమాదాలు, పెద్ద పెద్ద గాలులను కూడా ఆటమ్‌‌‌‌ ‌‌‌‌రూఫ్‌‌‌‌లు తట్టుకోగలవు. అలాగే ప్రీ ప్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ మొదలుకొని ఇంటీరియర్ ఫర్నిషింగ్ అవసరాలను తీర్చడానికి వీ నెక్స్ట్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ కింద వివిధ ప్రొడక్ట్‌‌‌‌లను కంపెనీ తీసుకొస్తోంది. వీటితో పాటు రీసైకిల్‌‌‌‌ చేసిన ప్లాస్టిక్‌‌‌‌తో టీ షర్ట్‌‌‌‌లను విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ తయారు చేయనుంది.  విశాక ఇండస్ట్రీస్ షేరు గత ఆరు నెలల్లో 87.85 శాతం పెరిగింది. గురువారం 0.78 % పడి రూ. 748.50 వద్ద క్లోజయ్యింది.