కేంద్రమంత్రి చొరవతో రైతుల పొలాలకు దారి

ముదిగొండ, వెలుగు : ముదిగొండకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై దారి  వదలాలని పలుమార్లు కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. బాధిత రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. దీంతో శుక్రవారం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి రైతులతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర మంత్రులు గట్కారి, కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రైతులు స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.