ఇవాళ్టి(ఫిబ్రవరి 03) నుంచి పాతగుట్టలో అధ్యయనోత్సవాలు

ఇవాళ్టి(ఫిబ్రవరి 03) నుంచి  పాతగుట్టలో అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3 నుంచి 6 వరకు నాలుగు రోజులపాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలతో అధ్యయనోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, , సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేయనున్నారు.

ఇందులోభాగంగా 3న ఉదయం తిరుమంజనం, సాయంత్రం తొళక్కం, 4న పురప్పాటు సేవ, తిరుమంజనం, దివ్యప్రబంధ సేవాకాలం, 5న పురప్పాటు సేవ, తిరుమంజనం, నమ్మాళ్వార్ పరమపద ఉత్సవం, 6న పురప్పాటు సేవ, రామానుజాచార్య తిరుమంజనం, నూత్తందాది పూజలతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.