‘పాథోన్‌‌‌‌పథం నూట్టండు సినిమాకు తెలుగు టైటిల్‌‌‌‌ ‘పులి’

‘పాథోన్‌‌‌‌పథం నూట్టండు సినిమాకు తెలుగు టైటిల్‌‌‌‌  ‘పులి’

సిజు విల్సన్, కయ్యదు లోహర్ జంటగా వినయన్ రూపొందించిన  మలయాళ యాక్షన్ పీరియాడిక్ డ్రామా ‘పాథోన్‌‌‌‌పథం నూట్టండు’. ఈ సినిమా తెలుగులో ‘పులి’ టైటిల్‌‌‌‌తో వస్తోంది.  సీనియర్ నిర్మాత సి.హెచ్. సుధాకర్ బాబు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో సిజు విల్సన్ మాట్లాడుతూ ‘ఇదొక రియల్ లైఫ్ స్టోరీ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌ ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు.

 వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విజువల్స్‌‌‌‌తో, గొప్ప థియేటర్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఇచ్చే సినిమా అంది కయ్యదు లోహర్. దర్శకుడు వినయన్ మాట్లాడుతూ ‘కేరళ చరిత్రలో దాగున్న కథ ఇది. సమాజంలోని ఒక దారుణానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడి స్టోరీ. తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీ’ అన్నాడు.  బాహుబలి, ఆర్‌‌‌‌‌‌‌‌ ఆర్ఆర్ స్థాయిలో ‘పులి’ సినిమా ఉండబోతుందన్నారు నిర్మాత సుధాకర్ బాబు. కె ఎల్. దామోదర్ ప్రసాద్, ఎస్.కె రామచంద్రనాయక్, ఎస్.కె ప్రసాద్ నాయక్ పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.