ఖమ్మం, వెలుగు: హోరాహోరీగా జరిగిన ఖమ్మం గ్రానైట్ శ్లాబ్, ఫ్యాక్టరీ ఓనర్స్అసోసియేషన్ఎన్నికల్లో అధ్యక్షుడిగా పాటిబండ్ల యుగంధర్ ఎన్నికయ్యారు. శనివారం నగరంలోని హరిత గార్డెన్స్‌లో ఉదయం పోలింగ్ జరగ్గా, సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి వేముల రవికుమార్‌పై 35 ఓట్ల మెజార్టీతో పాటిబండ్ల యుగంధర్ గెలుపొందారు. ఎన్నికల్లో కార్యదర్శిగా కమర్తపు గోపాల్ రావు, ట్రెజరర్ గా పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రియాజ్షేక్, ఈసీ మెంబర్లుగా దొండేటి స్వేధన్, పెరుమాళ్లపల్లి రవికుమార్ విజయం సాధించారు.
అసోసియేషన్ లో మొత్తం 444 ఓటర్లు ఉండగా, ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలింగ్ అనివార్యమైంది. అంతకుముందే వైస్ ప్రెసిడెంట్లుగా కొనకంచి శ్యామ్ ప్రసాద్, తమ్మినేని సాగర్, జాయింట్ సెక్రటరీగా చావా రామ్మూర్తి, ఈసీ మెంబర్లుగా అనిల్ కుమార్, లాలాప్రతాప్, బి.రాజగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఎలక్షన్లలో పాటిబండ్ల యుగంధర్ ప్యానల్ విజయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత సాదు రమేశ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిని పలువురు నేతలు అభినందించారు. రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొన్నారు.