కామారెడ్డి, వెలుగు : ఐసీయూలో కోమాలో ఉన్న ఓ పేషెంట్ ఎలుకలు కొరికిన ఘటన కామారెడ్డి జిల్లా హాస్పిటల్ వెలుగుచూసింది. స్థానిక హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ముజీబ్హైబీపీ కారణంగా కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు జిల్లా హాస్పిటల్లో చేర్పించగా ప్రస్తుతం ఐసీయూలో ట్రీటెమెంట్ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి ఐసీయూలోకి చేరిన ఎలుకలు ముజీబ్కాలు, చేతిని కొరికాయి.
అయితే ముజీబ్ కోమాలో ఉండడంతో ఎలుకలు కొరుతున్న విషయం తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత ఐసీయూలోకి వచ్చిన స్టాఫ్ ఎలుకలు కరిచినట్లు గుర్తించి ట్రీట్మెంట్చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ఆదివారం హాస్పిటల్ కు వచ్చి ఐసీయూను పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఘటనపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు.
ఇద్దరు డాక్టర్లు, నర్స్ సస్పెన్షన్
హైదరాబాద్, వెలుగు : కామారెడ్డి హాస్పిటల్ ఐసీయూలో పేషెంట్‌ను ఎలుకలు కరిచిన ఘటనలో ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్‌ను వేటు పడింది. ఐసీయూ ఇన్ చార్జి కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్‌చార్జ్ వసంత్ కుమార్, డ్యూటీ నర్స్ జి. మంజులను సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి ఆర్డర్స్ జారీ చేశారు.