గాంధీ హాస్పిటల్‌లో దారుణం.. లేడీ జూనియర్ డాక్టర్‌పై దాడి

గాంధీ హాస్పిటల్‌లో దారుణం.. లేడీ జూనియర్ డాక్టర్‌పై దాడి

సికింద్రాబాద్: కోల్ కతా ట్రైనీ డాక్టర్ దుర్ఘటన మరవక ముందే సికింద్రాబాద్ గాందీ హాస్పిటల్ లో మరో ఘటన చోటు చేసుకుంది. పేషంట్ వెంట వచ్చిన వ్యక్తి మహిళా డాక్టర్ పై దాడి చేశాడు. వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది, ఇతరులు అతన్ని అడ్డుకున్నారు. గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఓ మహిళ జూనియర్ డాక్టర్ పై పేషంట్ సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. 

Also Read :- స్వచ్ఛందంగా కూల్చేసుకోండి.. లేదంటే మేమే కూల్చేస్తం

మహిళా డాక్టర్ చేయి పట్టుకొని దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సిసిటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. వెంటనే నిందితున్ని చిలకల గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి జూనియర్ డాక్టర్ పై ఎందుకు దాడి చేశాడన్న విషయం ఇంకా తెలియదు.