పైసల కోసం హాస్పిటల్ కక్కుర్తి : ఆపరేషన్ లేట్ చేస్తే ప్రాణం పోయింది

పైసల కోసం హాస్పిటల్ కక్కుర్తి : ఆపరేషన్ లేట్ చేస్తే ప్రాణం పోయింది

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది. ఆరోగ్య శ్రీ అప్రువల్ కాలేదని హార్ట్ ఆపరేషన్ ఆలస్యం చేసింది. దీంతో సరైన సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి చెందాడు. చైతన్య పురి పోలీసుస్టేషన్ పరిధిలోని కొత్తపేట్ ఓజోన్ ఆసుపత్రిలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామానికి చెందిన నిమ్మనగొని నరసింహ(45) ఛాతి నొప్పితో అక్టోబర్ 14న చేరాడు. స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించారు. ఆరోగ్య శ్రీ అప్రువల్ కోసం రెండు రోజులు ఆపరేషన్ చేయకుండా లేట్ చేశారు. అక్టోబర్ 16న అప్రువల్ వచ్చాక.. ఆపరేషన్ మధ్యలో రోగి మృతి చెందాడు.

ALSO READ | మెదక్లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి

మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కొత్తపేట ఓజోన్ హాస్పిటల్ బయట ఆంధోళనకు దిగారు. ఆరోగ్య శ్రీ అప్రూవల్ కోసం రెండురోజులుగా ఆపరేషన్  చేయకుండా ఆసుపత్రి  వైద్యులు, యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వల్లనే నరసింహ మృతి చెందాడని బందువులు ఆరోపించారు. న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించి డిమాండ్ చేస్తున్నారు.