ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతి

ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

జీడిమెట్ల, వెలుగు: ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతిచెందడంతో కుటుంబసభ్యులు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపించారు. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. వరంగల్ కు  చెందిన సరస్వతి(43), కొద్ది రోజుల కిందట బాచుపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. 

ఆమెకు కడుపునొప్పి రావడంతో ఈనెల19న స్థానిక ఎస్ఎల్ జీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు టెస్ట్ లు చేసి హెర్నియా సమస్య ఉందని లాప్రోస్కోపీ సర్జరీ చేస్తుండగా.. పేషెంట్ పేగు తెగిపోయింది. మళ్లీ ఈనెల 22న రెండోసారి ఓపెన్​సర్జరీ చేశారు. దీంతో సరస్వతీ హెల్త్ దెబ్బతిని బుధవారం ఉదయం ఆమె మృతి చెందింది. మృతురాలి బంధువుల ఆందోళనతో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు.