వీడియో: ఆ గట్టున అంబులెన్స్.. ఈ గట్టున పేషంట్

వీడియో: ఆ గట్టున అంబులెన్స్.. ఈ గట్టున పేషంట్

రోగిని మంచంపై పడుకోబెట్టి వాగు దాటించిన బంధువులు

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొణిజర్ల మండలంలోని పగిడేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో సింగరాయపాలెంకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా.. సింగరాయపాలెంకు చెందిన ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురిఅయ్యాడు. దాంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం 108కు సమాచారమిచ్చారు. కానీ, వాగు పొంగడంతో అంబులెన్స్ గ్రామానికి రాకుండా వాగు అవతలే ఉండిపోయింది. దాంతో ఆ వ్యక్తి బంధువులు అతన్ని మంచంపై పడుకోబెట్టి వాగు దాటించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 1,446 కరోనా కేసులు

ఆధార్​ పీవీసీ కార్డులో ఎన్నో ఫీచర్లు.. రూ.50 చెల్లిస్తే కార్డు ఇంటికే..

40 ఏళ్లకే బిలినియర్లుగా మనవాళ్లు