ఆదిలాబాద్ : హస్పిటల్ భవనం పైనుంచి దూకి పేషెంట్ సూసైడ్ చేసుకున్నఘటన ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగింది. శుక్రవారం ఉదయం రిమ్స్ ప్రభుత్వ కాలేజీ మూడో అంతస్తు నుంచి దూకి రోగి సూసైడ్ చేసుకున్నాడు. పై నుంచి పడగానే గమనించిన సిబ్బంది ఎమర్జెన్సీ విభాగానికి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. కాసేపటికి చికిత్స పొందుతూ రోగి మృతి చెందాడు. రోగి మూడు రోజుల క్రితం కడుపునొప్పితో రిమ్స్‌లో ట్రీట్ మెంట్ కోసం చేరినట్లు తెలిపారు డాక్టర్లు.
మృతుడిని తలమడుగు మండలం కజ్జర్లవాసి నారాయణగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కడుపునొప్పి భరించలేక చనిపోయాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని తెలిపారు పోలీసులు.