జగిత్యాల జిల్లా ఆస్పత్రిలోకి వర్షపు నీరు.. ఇబ్బందుల్లో రోగులు, వైద్య సిబ్బంది

రాష్ర్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జగిత్యాల జిల్లా మాత శిశు ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ పై ఫ్లోర్ లో వర్షపు నీరు చేరడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పైన రేకుల షెడ్డు వేసి వార్డులను ఏర్పాటు చేశారు. షెడ్డు నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల వర్షపు నీళ్లు చేరాయని అంటున్నారు. భారీగా చేరిన నీళ్లతో రోగులతో పాటు వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగిస్తున్నారు.