భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణం రామవరంలోని 100పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో గుక్కెడు నీళ్ల కోసం బాలింతలు, గర్భిణులు, ఇతర పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ సరిగా పనిచేయకపోవడంతో ఎప్పుడు నీళ్లుంటాయో.. ఎప్పుడు ఉండవో తెలియని పరిస్థితి నెలకొంది.
వాష్ రూమ్‌లకు నీటి సరఫరా సరిగా లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. హాస్పిటల్లో తరుచూ వాటర్ ప్రాబ్లం ఏర్పడుతున్నా అధికారులు మాత్రం శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని పేషెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.