ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు ఆందోళన

ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు ఆందోళన

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్లలోని ఈఎస్ఐ. డిస్పెన్సర్సీ డాక్టర్లు, సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రోగులు శనివారం ఆందోళన చేశారు. మందులు లేవంటూ నెలల తరబడి తిప్పుతున్నారని ఆరోపించారు. డిస్పెన్సరీకి ఉదయం వస్తే సిబ్బంది ఉండడం లేదని, సాయంత్రం వరకూ వేచిఉండాల్సి వస్తోందన్నారు.  టైమింగ్స్​పాటించడం లేదని, ముందుగానే మూసేసి వెళ్తున్నారని ఆరోపించారు.