భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సమస్యలపై సోమవారం పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హాస్పిటల్‌కు పర్యటనకు వెళ్లిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌ను రోగులు నిలదీశారు. హాస్పిటల్లో పేషెంట్లను డాక్టర్లు పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
జ్వరంతో నాలుగు రోజులుగా హాస్పిటల్‌కు వస్తున్నా సరైనా వైద్యం అందించడం లేదని వాపోయారు. ఇక్కడ సౌకర్యాలు ఏవీ లేక, ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టరశ్రీ వెంటనే సరిపోను మందులు తెప్పించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎక్స్‌రే రూమ్ రిపేర్లకు అవసరమైన ఎస్టిమేషన్లను తయారు చేసి తనకు అందజేయాలన్నారు. ఆయన వెంట మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్‌తో పాటు పలువురు డాక్టర్లు ఉన్నారు.