కేఎంసీ సూపర్ స్పెషాలిటీలో రోగుల గోస 

కేఎంసీ సూపర్ స్పెషాలిటీలో రోగుల గోస 
  • డాక్టర్లు రాక..నేలపైనే  కూర్చున్న రోగులు

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలో మంగళవారం పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన డాక్టర్లు 11 గంటల వరకు కూడా రాకపోవడంతో పేషెంట్లు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడలేక అవస్థలు పడ్డారు.

నెఫ్రాలజీ విభాగానికి మంగళవారం సుమారు 400 మంది ఔట్ పేషెంట్లు రావడంతో భారీ రద్దీ ఏర్పడింది. దీంతో ఎంతసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాకపోవడం, కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో చాలామంది నేలపైనే కూర్చుండిపోయారు. సోమ, మంగళవారాల్లో ఈ హాస్పిటల్​కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసి కూడా అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పేషెంట్లు  మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.