పద్మారావునగర్: వివిధ అనారోగ్య సమస్యలతో మంగళవారం గాంధీ హాస్పిటల్‌కు పేషెంట్లు క్యూ కట్టారు. ఓపీడీ వద్ద బారులు తీరారు. ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకు స్కానింగ్‌కు వస్తే.. మధ్యాహ్నం 12 వరకు తమ నంబర్ రాలేదని పలువురు వాపోయారు. వార్డుల్లో కనీస వసతులు లేవని, మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయ ఆవేదన చెందారు.
పదుల సంఖ్యలో పేషంట్లు ఉంటే ఒక్కో వార్డులో ఇద్దరు వార్డు బాయ్స్మాత్రమే ఉన్నారని మండిపడ్డారు. పేషంట్లకు తగ్గట్లు డాక్టర్ల సంఖ్య పెంచాలని కోరారు. ఫార్మసీలో డాక్టర్లు రాసిచ్చిన మందులు దొరకడం లేదని, సగమే ఇస్తున్నారని వాపోయారు.