నల్లగొండ: యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించారు పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి. ప్లాంట్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణకు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ వేసింది సర్కార్.
ఛత్తీస్ గడ్ నుండి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ ప్లాంట్ లలో టెండర్లు పిలవకుండా కాంట్రాక్టులు కేటాయించడంపై కమిటీ విచారణ చేయనుంది. దీనిపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని అధికారులకు కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టులో మొదటి యూనిట్, సెప్టెంబర్ లో రెండవ యూనిట్ ... ఆరు నెలల్లో మిగతా మూడు యూనిట్లు ప్రారంభిస్తామని కమిటీకి అధికారులు తెలియజేశారు. విచారణ అనంతరం తుది నివేదికను సర్కార్ కు అందజేస్తామని కమిటీ తెలిపింది.