హైదరాబాద్, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు.
పట్నా పైరేట్స్ జట్ఉలో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) రాణించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 28–23 తేడాతో దబాంగ్ ఢిల్లీపై గెలిచింది. కాగా, మంగళవారం జరిగే మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది.